AP High Court: డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్లపై ఏపీ హైకోర్టు స్టే

AP High Court Stay on Degree College Online Admissions
x

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

AP High Court: ఏపీలో ఆన్ లైన్ విధానం ద్వారా డిగ్రీ అడ్మిషన్లు

AP High Court: డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. 70 శాతం కన్వీనర్, 30 శాతం యాజమాన్య కోటాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాజ్యం దాఖలైంది. యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్ భర్తీ చేయడంపై రాయలసీమ డిగ్రీ కళాశాలల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. పైగా, యాజమాన్య కోటాలో కోరుకున్న కాలేజీలకు వెసులుబాటు ఇవ్వలేదని ఆరోపించింది. దీనిపై ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ నెల 20న చేపట్టే సీట్ల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఆన్ లైన్ లో కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories