దమ్మాలపాటిపై ఏసీబీ దర్యాప్తు, విచారణ నిలిపివేత

దమ్మాలపాటిపై ఏసీబీ దర్యాప్తు, విచారణ నిలిపివేత
x
Highlights

ఏపీ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు స్టే విధించింది..

ఏపీ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు స్టే విధించింది.. ఈ మేరకు ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నాలుగు వారాలకు వాయిదా వేసింది. స్టే విధించడమే కాకుండా.. ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మీడియాలో కూడా రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అలాగే సోషల్‌ మీడియాలోనూ ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఉండొద్దని.. ఇందుకు ఏపీ ప్రభుత్వం , డీజీపీదే బాధ్యత అని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలు తనను వేధిస్తున్నారని.. అందువల్ల తదుపరి చర్యలు తీసుకోకుండా ఆపేలా ఆదేశించాలని దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దమ్మాలపాటి పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఈ కేసుపై స్టే విధించింది. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆయన తోపాటు మొత్తం 13 మందిపై మంగళవారం ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. ఈ భూ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌ను మొదటి నిందితునిగా, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి కుమార్తెలిద్దరి తోపాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ నమోదు చేసిన కేసులో విచారణను హైకోర్టు నిలిపివేయడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories