Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Ram Gopal Varma
x

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Highlights

Ram Gopal Varma: సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

Ram Gopal Varma: సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నాడు ఈ పిటిషన్ ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. అరెస్ట్ పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఈ నెల 11న కేసు నమోదైంది. 2024 మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్, బ్రహ్మణి లపై అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించి మద్దిపాడు పోలీసులు హైద్రాబాద్ లో వర్మకు ఈ నెల 13న నోటీసులు అందించారు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories