ఆ పోస్టులను తక్షణమే తొలగించాలి.. ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశాలు

AP High Court key Orders in Social Media Posts Against Judges
x

ఆ పోస్టులను తక్షణమే తొలగించాలి.. ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశాలు

Highlights

Andhra Pradesh: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.

Andhra Pradesh: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. జడ్జిలపై సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లను తక్షణమే తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్‌ మీడియాలో పోస్టులను తొలగించాలని తాము లేఖ రాసినా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ పట్టించుకోలేదని కోర్టుకి సీబీఐ లాయర్‌ తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ లేఖకు కూడా స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

సీబీఐ లేఖ రాస్తే కోర్టు ఉత్తర్వులుగానే పరిగణించాలంటూ ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఈ ఆదేశాలను తప్పక పాటించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, రిజిస్ట్రార్‌ జనరల్ లేఖలపై ఎందుకు స్పందించడం లేదంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల తరపు లాయర్లను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి హైకోర్టు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories