AP High Court: నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

AP High Court Key Orders about Navaratnalu Pedalandariki Illu Scheme | AP News Today
x

AP High Court: నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లపై ఏపీ హైకోర్టు్ కీలక ఉత్తర్వులు

Highlights

AP High Court: సెంటు, సెంటున్నరలో ఎలా కడతారని హైకోర్టు ప్రశ్న...

AP High Court: 'పేదలందరికీ ఇళ్లు' పథకంపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లనుంది ఏపీ సర్కార్. నేడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 'పేదలందరికీ ఇళ్లు' పథకంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హత ఉన్న పురుషులు.. ట్రాన్స్‌జెండర్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కన్వేయన్స్ డీడ్‌ను రద్దు చేసి.. డీ-ఫారం పట్టా ఇవ్వాలని స్పష్టం చేసింది.

హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటంతో.. దీని పైన అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేయస్తామనడంలో హేతుబద్ధత పైన కోర్టు ప్రశ్నలు సంధించింది. ఇక వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ నిర్ణయం అమలుకు బ్రేకులు పడ్డాయి. దీంతో దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories