AP Curfew: ఆంక్షల పొడిగింపుపై నేడు సీఎం జగన్ నిర్ణయం

AP Govt May Extends Curfew in Andhra Pradesh
x

సీఎం జగన్(ఫైల్ ఇమేజ్ )

Highlights

AP Curfew: ఏపీలో నేటితో లాక్‌డౌన్‌ ముగియనుంది.

AP Curfew: ఏపీలో నేటితో లాక్‌డౌన్‌ ముగియనుంది. తెలంగాణలో ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరీ ఏపీలో కూడా పెంచుతారా.. లేదంటే సడలింపుల్లో మార్పులు తీసుకువస్తారా.. అని ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం జగన్‌ కోవిడ్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో గతంలో ప్రతిరోజు 20వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. లాక్‌డౌన్‌ పుణ‌్యమా అని కొద్ది రోజులుగా 14 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు వంద మందికి పైగా చనిపోతున్నారు. కర్ఫ్యూ కంటిన్యూ చేస్తేనే బెటర్‌ అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

కోవిడ్‌ను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేసే యోచనలో ఉంది. మరో వారం పాటు కర్ఫ్యూను పొడిగించాలని సర్కార్ ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కర్ఫ్యూ నుంచి కాస్త మినహాయింపు ఉంది. మరీ ఇప్పుడు ఇదే విధానాన్ని కొనసాగిస్తారా.. లేదంటే సడలింపులో మార్పలు చేర్పులు చేస్తారా అని ఏపీ ప్రజలు, వ్యాపారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories