AP Budget: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్.. రాష్ర్ట చరిత్రలోనే తొలిసారిగా ఇలా..

AP Govt Issued Ordinance For Vote On Account Budget
x

AP Budget: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్.. రాష్ర్ట చరిత్రలోనే తొలిసారిగా ఇలా..

Highlights

AP Budget: ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకుంది.

AP Budget: ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాలపరిమితి నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు ఒక లక్షా 30 వేల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూపొందించింది.

అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 11 వందల కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు. అలాగే.. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్‌ నిధులు కేటాయించినట్టు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో 2024 సెప్టెంబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories