మత్స్యకారుల వేటకు విరామం .. ఈనెల 15 నుంచి జూన్ 14 వరకూ వేట బ్యాన్...

AP Govt Banned Fish Hunting From 15 04 2022 to 14  05 2022 | AP Live News
x

మత్స్యకారుల వేటకు విరామం .. ఈనెల 15 నుంచి జూన్ 14 వరకూ వేట బ్యాన్...

Highlights

Break to Fishermen: బ్యాన్ రుసుము అందడం లేదని మత్స్యకారుల ఆవేదన...

Break to Fishermen: కడలి కెరటాలపై జీవనం సాగించే మత్స్యకారుల వేట విరామానికి సమయం ఆసన్నమైంది. సముద్రంలో వేట నిషేదం అమలులోకి వచ్చింది. మత్స్య సంపద పరిరక్షణ కోసం ఏపీ(AP) ప్రభుత్వం ఏటా అమలు చేసే హంటింగ్ బ్యాన్ పీరియడ్ ఈనెల 15 నుంచి జూన్ 14 వరకూ అమలులో ఉండనుంది. కానీ ఎన్నో ఆంక్షల నడుమ తమ జీవన భృతి కాంక్షలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాన్ పీరియడ్‌(Ban Period)లో తమకు అందాల్సిన రుసుము అందడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుసుము అందించి ఈ రెండు నెలలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories