ఏపీ స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. పునః ప్రారంభం ఎప్పుడంటే..?

AP Govt Announced Summer Holidays for Schools from 06 05 2022 to 4 06 2022 | Live News
x

ఏపీ స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. పునః ప్రారంభం ఎప్పుడంటే..?

Highlights

AP Schools Summer Holidays 2022: వచ్చే నెల 4లోగా పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశం...

AP Schools Summer Holidays 2022: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో సాధారణ ప్రజలతో పాటు స్కూళ్లకు వెళ్లి పిల్లలు సైతం అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఒంటిపూట బడులే కొనసాగుతున్నా మిట్టమధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి పిల్లలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది. మే 6 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం వచ్చే నెల 4లోగా 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని కమిషనర్‌ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 4న పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఏపీలో విద్యాసంవత్సరంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సిలబస్ తగ్గింపులు, సెలవుల కుదింపుతో పాటు విద్యాసంవత్సరాన్ని సైతం ముందుకు జరుపుతున్నారు.

పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్ధులను పాస్ కూడా చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉండగా.. అది కాస్తా మే 6వరకూ పొడిగించాల్సి వచ్చింది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారుల నుంచి స్కూళ్లకు ఆదేశాలు అందాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories