Water Dispute: సుప్రీంకోర్టుకు కృష్ణా జలాల వివాదం

AP Government Petition in Supreme Court on Krishna Water Dispute
x

అత్యున్నత న్యాయస్థానం (ఫైల్ ఇమేజ్)

Highlights

Water Dispute: తెలంగాణ అక్రమాలకు పాల్పడుతుందంటూ ఏపీ పిటిషన్‌ * కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని పిటిషన్

Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ అక్రమాలకు పాల్పడుతుందంటూ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్టు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్ది చేయాలని కోరారు. ఏపీకి న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండికొడుతుందని ఏపీ సర్కార్ ఆరోపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజలు జీవించే హక్కును హరిస్తుందని పిటిషన్లో ఏపీ ప్రభుత్వం తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories