Andhra News: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు

Ap Government Issued Orders That Establish Amravati Municipal Corporation
x

Andhra News: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు

Highlights

Andhra News: అమరావతి మున్సిపాలిటీలో 22 గ్రామాల విలీనంపై..

Andhra News: ఏపి రాజధానిపై మళ్లీ రచ్చ ప్రారంభమవుతోంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మళ్లీ తీసుకొస్తామని వైసీపీ నేతలు చెబుతుంటే మరోవైపు అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12న మహా పాదయాత్రను అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

రాజధాని పరిధిలోని 22 గ్రామ పంచాయతీలతో అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఆయా గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపద్యంలో కమిషనర్ ఆదేశాలతో గుంటూరు జిల్లా కలెక్టరు సైతం గ్రామ సభ నిర్వహణకు చర్యలు చేపట్టారు.

రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది. అప్పట్లో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని పరిధిలోని మొత్తం 29 పంచాయతీలతో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టిన ఆయా గ్రామాల ప్రజలు గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలను సైతం అడ్డుకుని ప్రభుత్వం రాజధాని గ్రామాలను విడదీసి కొత్తగా మునిసిపాలిటీ ఏర్పాటు చేయడం ప్రశ్నించారు.

ఇక రాజధాని గ్రామల పరిధిలో ఎట్టి పిరిస్థితుల్లోనైనా ఆయా గ్రామాలను మునిసిపాలిటీ పరిధిలోకి తీసుకొని రావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అమరావతి మునిసిపాలిటీ పరిధిలో 22 గ్రామాల వీలినానికి సంబంధించిన షెడ్యూల్ తేదీలను కూడా విడుదల చేసింది. గ్రామాల విలీనంలో భాగంగా తుళ్ళూరు మండలం పరిధిలోని 19, మంగళగిరి మండలం పరిథిలో 3 గ్రామాలతో.. అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో భాగంగానే ఆయా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయసేకరణ జరపాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలూ చేపట్టాలని పంచాయతీల తీర్మానాలను నివేదించాలని ఆదేశించారు. ఇక నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీ ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్త్ర ప్రభుత్వం ప్రతిపాదనకు అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories