AP: గ్రామ, వార్డు సచివాలయాలకు..సర్కార్ కీలక ఆదేశాలు.!

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు..సర్కార్ కీలక ఆదేశాలు.!
x
Highlights

AP: ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరింది. కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవల విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

AP: ఏపీ రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరింది. అధికారం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాల పేర్లను మార్చిన కూటమి సర్కార్..వైఎస్సార్, జగన్ పేరుతో ఉన్న స్కీంల ప్లేసులో ఎన్టీఆర్, చంద్రన్న పథకాలుగా పేర్లను మార్చుతోంది. దీనిపై ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

ఇప్పుడు తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్. వీటికి సంబంధించి కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. ప్రభుత్వ స్కీంలు, కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు, సర్టిఫికేట్ల జారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఏ పత్రాల్లో ఎలాటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలకు ఈ ఆదేశాలను జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ చంద్రబాబు సర్కార్ ఆయా శాఖలకు, కార్యదర్శులకు, హెచ్ఓడీలకు సర్క్యూలర్ జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

కాగా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి మార్గదర్శకాలను సర్కార్ జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు, సర్టిఫికేట్ల జారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర పత్రాల్లో ఎలాంటి ఫొటోలు, రంగులు ఉండేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. అటు పార్టీ రంగులు, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్దిదారుల పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలను నిలిపివేయాలని సంబంధిత శాఖలకే ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories