AP News: ఆగస్టు 15 తేదీన పాటించాల్సిన నియమావళి విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

AP government has released the rules to be followed on August 15
x

AP News: ఆగస్టు 15 తేదీన పాటించాల్సిన నియమావళి విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Highlights

AP News: రాష్ట్ర జిల్లా స్థాయిలో వేడుకల నిర్వహణపై ఉత్తర్వులు జారీ

AP News: రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రగస్టు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు జెండా ఎగురవేయనున్నారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొననున్నారు. మిగతా జిల్లాలో మంత్రులు.. జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. అల్లూరి జిల్లాలో మాత్రం కలెక్టర్ జెండా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా దళాల నుంచి గౌరవ వందనం కూడా స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాల్లో పాల్గొనే మంత్రుల వివరాలు..

శ్రీకాకుళం- అచ్చెన్నాయుడు

విజయనగరం- కొండపల్లి శ్రీనివాస్‌

పార్వతీపురం మన్యం- గుమ్మిడి సంధ్యారాణి

విశాఖపట్నం- అనగాని సత్యప్రసాద్‌

అనకాపల్లి- వంగలపూడి అనిత

తూర్పుగోదావరి- కందుల దుర్గేశ్‌

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- వాసంశెట్టి సుభాష్‌

పశ్చిమగోదావరి- నిమ్మల రామానాయుడు

ఏలూరు- కొలుసు పార్థసారథి

కృష్ణా- కొల్లు రవీంద్ర

గుంటూరు- నారా లోకేశ్‌

పల్నాడు- నాదెండ్ల మనోహర్‌

బాపట్ల- గొట్టిపాటి రవికుమార్‌

ప్రకాశం- డోలా బాలవీరాంజనేయస్వామి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు- పి. నారాయణ

చిత్తూరు- సత్యకుమార్‌

కడప- ఎన్‌ఎండీ ఫరూక్‌

అన్నమయ్య- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

తిరుపతి- ఆనం రామనారాయణరెడ్డి

నంద్యాల- బీసీ జనార్దన్‌రెడ్డి

కర్నూలు- టీజీ భరత్‌

అనంతపురం- పయ్యావుల కేశవ్‌

శ్రీ సత్యసాయి- సవిత

Show Full Article
Print Article
Next Story
More Stories