ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతిపై సర్కార్ కీలక నిర్ణయం

AP Government has Decided to Provide Free Accommodation to Employees in Amaravathi
x

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతిపై సర్కార్ కీలక నిర్ణయం

Highlights

Andhra Pradesh: అమరాతిలో ఉద్యోగులకు ఉచిత వసతి రెండు నెలలు పొడిగింపు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతిపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరాతిలో ఉద్యోగులకు ఉచిత వసతిని మరో రెండు నెలలు పొడిగిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు ఉచిత వసతిని మరో రెండు నెలల పాటు కల్పించనున్నారు.

ఆగస్టు 31 వరకు ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతి రద్దు చేస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని వాటిని మంచి స్థితిలో అప్పగించాలని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతిలో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతి మేరకు ఉచిత వసతి సదుపాయాన్ని రెండు నెలలపాటు పొడిగించింది.

రాష‌్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ సచివాలయంలో పని చేసే ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో అమరావతి సచివాలయానికి వచ్చారు. ఆ సమయంలో ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడు అమరావతిలో ఉచితంగా వసతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగు ఓ రైలును హైదరాబాద్ నుంచి విజయవాడకు నడిపింది. వారాంతంలో రెండు సెలవులను మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories