పేదల ఇళ్ళు.. రైతుల భూములు.. మధ్యలో దళారీ నేతలు!

పేదల ఇళ్ళు.. రైతుల భూములు.. మధ్యలో దళారీ నేతలు!
x
Highlights

రైతు ప్రభుత్వం అని సర్కార్‌ చెబుతుంటే క్షేత్రస్థాయిలో కొందరు స్థానిక నేతలు రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు.పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో పశ్చిమగోదావరి...

రైతు ప్రభుత్వం అని సర్కార్‌ చెబుతుంటే క్షేత్రస్థాయిలో కొందరు స్థానిక నేతలు రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు.పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములపై దళారులు కన్నేశారు. అటు ప్రభుత్వానికి ఇటు భూములు అమ్మిన.. ఇక లబ్ధిదారులకు వారధిగా ఉంటూ కోట్లు నొక్కేస్తున్నారు. ఎకరాకు ఏకంగా 5 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామంలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం భూమి కొనుగోలు చేసింది. అయితే పేదలకు పక్కా ఇళ్ల పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాలు కేటాయింపులకు సిద్ధమవుతున్నాయి. ఈ భూముల వ్యవహారంలో కొందరు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. భూముల కొనుగోలు విషయంలో రైతులకు ఇచ్చే రేటు ఒకటైతే వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వం నుంచి లెక్కల్లో చూపించే రేటు మరోటి ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు.

పెనుమదం గ్రామంలో ఓ బాధిత రైతు తనకు జరిగిన అన్యాయంపై గొంతెత్తడంతో అసలు విషయం బట్టబయలైంది. ఎకరాకు 5 లక్షల చొప్పున 8 లక్షల13వేల రూపాయలను వసూలు చేసారని రైతు రోడెక్కాడు. వారణాసి వెంకటేశ్వరరావు అనే రైతు తనకు చెందిన ఎకరం 78 సెంట్ల వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కోరగా అమ్మడానికి ముందుకొచ్చారు. స్థానికంగా సొసైటీ ప్రెసిడెంట్ జోక్యం చేసుకుని రైతుకు 35 లక్షలు మించి ఎకరానికి ధర రాదని మాయమాటలు చెప్పి తప్పుడు అగ్రిమెంట్ రాయించుకున్నట్లు సమాచారం. తీరా రైతుల అకౌంట్‌లోకి ఎకరాకు 40 లక్షల రూపాయల చొప్పున పడ్డాయి. రైతుల అకౌంట్‌లో డబ్బు పడిన నాటి నుంచి తనకు 5 లక్షలు కమీషన్ ఇవ్వాలని సొసైటీ ప్రెసిడెంట్‌ డిమాండ్‌ చేశాడని బాధిత రైతు ఆవేదన చెందుతున్నాడు.

పేదలకు స్థలాలు ఉచితంగా ఇస్తున్నారా..? అమ్ముతున్నారా అంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను పరిశీలించారు. భూమి కొనుగోళ్లలో అక్రమ వసూళ్లనూ తిరిగి రైతుల ఖాతాలో వేయాలని డిమాండ్‌ చేశారు. కొనుగోళ్ల పంపిణీలో కోట్లు దండుకుంటే కేసులు ఎందుకు లేవని ప్రశ్నించారాయన

ఏపీలో భూ మాఫియా దోపిడీ విచ్చిల విడిగా సాగుతోందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ నేతలు రైతుల నుంచి లబ్ధిదారుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. బాధితులతో కలిసి ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

భూముల సేకరణ అస్తవ్యస్తంగా సాగుతోందని అమ్మినవారిని లబ్ధిదారులను ప్రభుత్వాలను మోసగించే దళారి వ్యవస్థ బయల్దేరిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నారు. ఇప్పటికైనా మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని తమను కాపాడాలంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories