Andhra Pradesh: విద్యాప్రగతి కోసం జగన్‌ సర్కారు ముందడుగు..'బైజూస్‌'తో కీలక ఒప్పందం

AP Government Agreement With BYJUS | AP News
x

Andhra Pradesh: విద్యాప్రగతి కోసం జగన్‌ సర్కారు ముందడుగు

Highlights

Andhra Pradesh: అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఇన్నాళ్లు సాంప్రదాయ పద్దతిలో పాఠ్యాంశాలతో తరగతులు నిర్వహించే స్థాయినుంచి ఆధునిక టెక్నాలజీతో వీడియో పాఠాలను బోధించబోతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే విద్యాసంస్కరణలు అమలు చేసేందుకు సీఎం జగన్‌, అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బైజూస్‌ పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించబోతున్నారు.

ఇందుకోసం 500 కోట్ల రూపాయలతో విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్‌ బోర్డు సిలబస్‌తో బైజూస్ విద్యాబోధన పద్దతుల్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటుచేసి వీడియో పాఠాలను బోధించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories