Narayana Swamy: పెనుమూరు గ్రామాల అభివృద్ధికి పనిచేయకుంటే చీపురుతో కొట్టండి

AP Deputy CM Narayana Swamy Sensational Comments
x

Narayana Swamy: పెనుమూరు గ్రామాల అభివృద్ధికి పనిచేయకుంటే చీపురుతో కొట్టండి 

Highlights

Narayana Swamy: పెనుమూరులోని ఓ కాలనీ సమస్యలు విన్నవించిన మహిళలు

Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యా‌ఖ్యలు చేశారు. పెనుమూరు గ్రామాల అభివృద్ధికి పనిచేయని వారిని చీపురుతో కొట్టండి అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా వెనుమూరు మండలం తిమ్మరాజుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఓ కాలనీ మహిళలు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. విద్యుత్ స్తంభాలు, గుడి, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మీరు చీపుర్లు, చేటలు తీసుకొచ్చి ఇక్కడ వేయండి... మీరు చెప్పింది చేయకపోతే నన్నయినా కొట్టండి... ఓట్లు వేయించుకుని పనిచేయని వారిని కొట్టాలా...? వద్దా...? మీరే నిర్ణయించుకోండి... నేను పనిచేయక పోయినా నిలదీయండి' అంటూ వారికి సూచించారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories