AP: పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

AP CS, DGP to Delhi today
x

AP: పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

Highlights

AP: మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనపై సీరియస్

Delhi: నేడు ఏపీ సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా.. 13 తేదీన జరిగిన ఎన్నికల రోజు.. ఆ తర్వాత రోజు.. మాచర్ల,తాడిపత్రి, చంద్రగిరి, నరసారావుపేటలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలింగ్ తీరుపై పూర్తి నివేదికతో ఢిల్లీకి రావాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్‌లతో సీఎస్ అత్యవసర భేటీ అయ్యారు. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు విఫలం అయ్యారని.. రాజకీయ నాయకులు పార్టీలు ఆరోపించడంతో.. ఈసీ స్పందించింది. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్‌ను ప్రశ్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories