Sharif: సీఎం జగన్ నన్ను అలా పిలిచేవారు..భావోద్వేగానికి లోనైనా ష‌రీఫ్‌

ap council chairman sharif gets emotional
x

ష‌రీఫ్ ఫైల్ ఫోటో 

Highlights

Sharif: ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లి నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది.

Sharif: ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లి నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్ ఈ నెల‌తో ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. పదవి విరమణ సందర్భంగా వీడ్కోల సభలో చైర్మన్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యల చేశారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ..తన పదవి ముగుస్తోందని, సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నారు. పదవి కాలం ముగిసే సమయానికి సభ జరగడం ఆనందంగా ఉందని ఆయ‌న అన్నారు. అనేక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ,చైర్మన్ గా ఎన్నికయ్యాను తనకు ఈ పదవి ఎవరో ఇచ్చారని అనుకోవడం లేదని, రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు.

అందరూ నాకు సహనం ఎక్కువ అంటున్నారు. జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా హై టీ కార్యక్రమంలో కలిశా. సీఎం జగన్‌ చాలా అప్యాయంగా షరీఫ్‌ అన్న అని పలకరించారు. కానీ నాకంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి సహనం ఎక్కువ. బిల్లు ఘటన జరిగిన 3 రోజులకు ఓ కార్యక్రమంలో సీఎంను కలిశా. ఎందుకు కలత చెందారని స్వయంగా అడిగారు. గతంలో ఏ పెద్ద పదవులు చేయలేదు, నేరుగా ఛైర్మన్‌ అయ్యానని చెప్పాను. మండలిలో కీలక నిర్ణయాల దృష్ట్యా కలత చెందానని సీఎంకు చెప్పా. నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు' అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ స‌మావేశాల అనంత‌రం ఆయ‌న‌కు వీడ్కోలు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఒక దశలో రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నానని, కానీ పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. చంద్రబాబు నా కష్టాన్ని గుర్తించి చైర్మన్ గా ఎంపిక చేశారు. రాజకీయా నాయకులకు రిటైర్మెంట్ ఉండదు. ఇకపై ఆధ్యాత్మిక, ప్రజా సేవలో ఉంటాను. అంటూ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories