YS Jagan: జలవనరులశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

AP Cm YS Jagan Review Meeting On Water Resources Department
x

YS Jagan File Photo

Highlights

YS Jagan: జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు

YS Jagan: జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 91 శాతం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని.. జూన్‌ 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలను పూర్తిచేశామని జూన్‌ నెలాఖరుకల్లా కాఫర్‌ డ్యామ్‌లో మొదటి రెండు రీచ్‌లు పూర్తవుతాయని తెలిపారు. అలాగే, జులై ఆఖరుకు నాటికి కాఫర్‌ డ్యామ్‌ 3, 4 రీచ్‌ పనులు నిర్ణీత ఎత్తుకు పూర్తి అవుతాయన్నారు. దాంతో, దిగువ కాఫర్‌ డ్యాం పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం బిల్లులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. 1600 కోట్ల రూపాయల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు. పోలవరం అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అన్న ముఖ్యమంత్రి జగన్‌ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులకు సూచంచారు. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకెళ్తున్నట్లు జగన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories