పోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ!

పోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ!
x
Highlights

పోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ ఏడు పేజీల లేఖ రాశారు. నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతోందని, ఇరిగేషన్‌, భూసేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు.

పోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ ఏడు పేజీల లేఖ రాశారు. నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతోందని, ఇరిగేషన్‌, భూసేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం చేతిలో ఉందని విభజన చట్టంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టిందని, కేంద్రం రూ.8,507కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉందని జగన్ అ లేఖలో పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయండని జగన్ కోరారు.





Show Full Article
Print Article
Next Story
More Stories