నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

AP CM to Release Swarnandhra Vision 2047 Document Today
x

నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

Highlights

Vijayawada: నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్(Swarnandhra Vision 2047 Document)ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.

Vijayawada: నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్(Swarnandhra Vision 2047 Document)ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో.. 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, కలెక్టర్లు, అధికారులు హాజరుకానున్నారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం దృష్ట్యా విజయవాడ(Vijayawada)లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయ. నేడు బందర్ రోడ్డుపై ఆటోలు, బస్సులకు అనుమతి నిరాకరించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే బందర్ రోడ్డులో అనుమతి ఇవ్వనున్నారు. ఈ నింబంధనలను పాటిస్తూ నగరవాసులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories