Breaking News: సీఎం జగన్‌ తిరుపతి పర్యటన రద్దు

AP CM Jagan Tirupati Tour Cancelled
x

Breaking News: సీఎం జగన్‌ తిరుపతి పర్యటన రద్దు

Highlights

Breaking News: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ, తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

Breaking News: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ, తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ తప్పిదాలను వివరిస్తూ ప్రతిపక్షాలు ఓట్లు అడుగుతుండగా ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది వైసీపీ.

ఇది ఇలా ఉండగా ఏపీలో కరోనా విజృంభిస్తుండడంతో తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు సీఎం. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేక పోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లే ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఇవాళ కరోనా బులెటిన్‌ చూశాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన లేఖలో తెలిపారు. మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే, వేలాది మంది వస్తారు. దాంతో, మళ్లీ కొవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు సీఎం. బాధ్యత గల సీఎంగా తిరుపతిలో సభను రద్దు చేసుకుంటున్నానని, వైసీపీకి ఓట్లు వేసి, సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని సీఎం జగన్‌ తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories