సదరన్‌‌కౌన్సిల్ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ నుంచి..

సదరన్‌‌కౌన్సిల్ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ నుంచి..
x

సదరన్‌‌కౌన్సిల్ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ నుంచి..

Highlights

Andhra Pradesh: తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన జరిగిన సదరన్‌కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన జరుగుతున్న సదరన్‌కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలో పరిష్కారం కావాలన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. ఇదే సమయంలో విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదన్న జగన్ తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు.

మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితులపైనా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరటనివ్వాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రుణాల పరిమితిని దాటిందన్న జగన్ ఆ కారణంతో ఇప్పుడు ఏపీకి రుణాల్లో కోత విధిస్తున్నారని అమిత్‌షాకు తెలిపారు.

ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు కేవలం రాష్ట్రాలకు చెందినవే కాదని, ఇవి జాతీయ అంశాలని అమిత్‌షా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకుంటామన్న అమిత్‌షా ఏపీ, తెలంగాణ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories