బోర్ల కింద వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలేయించాలి - సీఎం జగన్‌

AP CM Jagan Said No to Paddy Crop and Suggested to Farm Cereals | Telugu Online News
x

బోర్ల కింద వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలేయించాలి - సీఎం జగన్‌

Highlights

YS Jagan: చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలివ్వండి - జగన్‌

YS Jagan: బోర్ల కింద వరిని సాగుచేయొద్దని రైతులకు సూచించారు సీఎం జగన్‌. అంతే ఆదాయాన్నిచ్చే చిరుధాన్యాలను సాగు చేయాలన్నారు. ఆధాన్యాలకు మద్దతు ధర కల్పించేందుకు మిల్లెట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జగన్‌. రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మినవారిపై రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం చట్టంలో మార్పులు చేయాలని, అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకురావాలన్నారు.

మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్‌. దీంతోపాటు సహజ పద్దతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఆర్బీకే యూనిట్‌గా సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని‌.., ఆర్డీకే పరిధిలో ఏర్పాటు చేస్తున్న సీహెచ్‌సీలో కూడా సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలన్నారు. ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్‌ సర్టిఫికేషన్‌ కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలన్నారు.

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పురుగుమందులు రైతులకు అందించే సదుద్దేశంతో ఆర్బీకేలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు సీఎం జగన్‌. వీటిని నీరుగార్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగుల ప్రమేయం ఉంటే.., వారిని తొలగించడమే కాదు, చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. మూగజీవాలకు ఆర్గానిక్‌ ఫీడ్‌ అందుబాటులో ఉండాలన్నారు. కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories