CM Jagan: అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తాం

AP CM Jagan Reviews on Spandana program
x

CM Jagan: అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తాం

Highlights

CM Jagan: గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలని, వాటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరపాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

CM Jagan: గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలని, వాటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరపాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారుల గైర్హాజరుపై మండిపడ్డారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్మామెన్స్‌ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశించారు. వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పామన్న జగన్‌, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని ప్రశ్నించారు.

బియ్యం, పెన్షన్‌ కార్డులు ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవన్న జగన్ అవి నిర్దేశించుకున్న గుడువులోగా అర్హులకు అందేలా చూడాలన్నారు. వీటిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షణతోపాటు సమీక్ష చేయాలన్నారు. ఏమైనా లోపాలు ఉంటే పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పేదల గురించి ఆలోచించి మానవత్వం చూపించాలన్నారు.

ఆగస్టు 10న నేతన్న హస్తం, 16న విద్యాకానుక అందజేస్తున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. అదేవిధంగా 20వేల రూపాయలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని ఇందుకోసం కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories