CM Jagan Reviews on Higher Education: ఏపీలో అక్టోబర్‌ 15 నుంచి కాలేజీలు ప్రారంభం: సీఎం జగన్‌

CM Jagan Reviews on Higher Education: ఏపీలో అక్టోబర్‌ 15 నుంచి కాలేజీలు ప్రారంభం: సీఎం జగన్‌
x
Highlights

CM Jagan reviews on higher education: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య...

CM Jagan reviews on higher education: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. మూడేళ్ల, నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్ విధానం తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, అనంతరం మరో ఏడాది పాటు స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి కల్పన కోర్సుల బోధన జరపాలని తెలిపారు.

ఆ తర్వాతే అది డిగ్రీ ఆనర్స్ గా పరిగణించబడుతుందని సీఎం వెల్లడించారు. అయితే, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థి సాధారణ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? లేక ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? అనే దానిపై దరఖాస్తులో ఆప్షన్ ఉంటుందని వివరించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories