AP volunteers: ఏపీలో వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్..ఉద్యోగం, నెలకు రూ. 10వేలు లేనట్లే?

AP volunteers: ఏపీలో వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్..ఉద్యోగం, నెలకు రూ. 10వేలు లేనట్లే?
x
Highlights

AP volunteers: ఏపీలో వాలంటీర్ల నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లు ప్రజలకు ఇంటి వద్ద సేవల అందిస్తూ ప్రభుత్వ పథకాలను...

AP volunteers: ఏపీలో వాలంటీర్ల నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లు ప్రజలకు ఇంటి వద్ద సేవల అందిస్తూ ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు చేరవేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ వారికి అనుకూలంగా పనిచేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీపీ, జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీనేతల ఒత్తిడితోనే వాలంటీర్లు సమూహంగా రాజీనామా చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా పక్కనపెట్టారు. పింఛన్లు సచివాలయ ఉద్యోగులే లబ్దిదారులకు ఇంటికి తీసుకెళ్లి అందజేస్తున్నారు. దీనిపై వాలంటీర్లు ఆందోళన తీవ్ర తరం చేస్తున్నారు. వాలంటీర్ల నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో ప్రభుత్వం పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టబోతున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

విజయవాడలో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించేంత వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. వాలంటీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గురువారం గ్రామ, వార్డు సచివాలయాలకు వినూత్న వినతిపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చుని బిక్షాటన చేశారు.

వాలంటీర్ల ఆందోళన, వారికి ఎదురైన సమస్యలు, ప్రభుత్వం వైఖరిపై సమగ్ర దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం వీరిని ఆదుకుంటుంటా లేక నిరసనలు మరింత పెరుగుతాయా అనేది చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories