Chandrababu: ఐపీఎస్, ఐఏఎస్‌లకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

AP CM Chandrababu Sweet Warning to IPS and IAS Officers
x

Chandrababu: ఐపీఎస్, ఐఏఎస్‌లకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

Highlights

Chandrababu: ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు తొలి భేటీలోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.

Chandrababu: ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు తొలి భేటీలోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం సచివాలయంలో అధికారులతో సమావేశమైన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పరిపాలనా వ్యవస్థ విధ్వంసానికి గురైందన్నారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు బాధించిందని ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదని అన్నారు చంద్రబాబు. గత ఐదేళ్లలో ఎలా పనిచేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలిపారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలని.. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారని అన్నారు. ఏపీలోని కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారని, కానీ గత ఐదేళ్లలో అధికారులు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. వివిధ ప్రభుత్వశాఖలు నిస్తేజంగా తయారయ్యాయని, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం లేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తన బాధ అని వెల్లడించారు. పరిపాలన గాడిలోపెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని, త్వరలోనే పాలనను చక్కదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories