AP Cabinet: ఏపీలో పోలీసు అధికారుల తీరుపై సీఎం సీరియస్.. నెలరోజుల్లో..

AP Cabinet: ఏపీలో పోలీసు అధికారుల తీరుపై సీఎం సీరియస్.. నెలరోజుల్లో..
x

AP Cabinet: ఏపీలో పోలీసు అధికారుల తీరుపై సీఎం సీరియస్.. నెలరోజుల్లో..

Highlights

AP Cabinet: ఏపీలో పోలీసు అధికారుల తీరుపై మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చ జరిగింది.

AP Cabinet: ఏపీలో పోలీసు అధికారుల తీరుపై మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చ జరిగింది. వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై సుదీర్ఘంగా సీఎంతో డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై ఉదాసీనత తగదంటూ చర్చ లేవనెత్తారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్ లకు సరిగా స్పందించట్లేదని మంత్రులు సీఎంకు వివరించగా.. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తాను అందుకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

ఇక జగన్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా సీఎంతో మంత్రులు చర్చించారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థ ను గాడికి తెద్దామన్నారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం.

Show Full Article
Print Article
Next Story
More Stories