Chandrababu Naidu: గిరిజన సంక్షేమశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

AP CM Chandrababu Review on Tribal Welfare Department
x

Chandrababu Naidu: గిరిజన సంక్షేమశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

AP CM Chandrababu Review on Tribal Welfare Department

Highlights

Chandrababu Naidu: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదు

Chandrababu Naidu: గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం గర్భిణి వసతి గృహాలు, ట్రైకార్‌, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్‌ చేయాలని సూచించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజనుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మండిపడ్డారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టాలని ఆదేశించారు.

2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్‌ ఓవర్ సీస్ విద్యానిధి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories