అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఐడీ దూకుడు

AP CID Arrested Five Persons In Amaravati Assigned Lands Scam
x

అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఐడీ దూకుడు

Highlights

*ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు

Andhra Pradesh: అమ‌రావ‌తి రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఐదుగురిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు చెందిన అసైన్డ్ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కు రాజ‌ధాని రాక‌ముందే కొనుగోలు చేసిన‌ట్టు సీఐడీ పేర్కొంది. మాజీ మంత్రి నారాయ‌ణతో పాటు కుటుంబ స‌భ్యుల పాత్ర ఉంద‌ని సీఐడీ చెబుతోంది.

రాజ‌ధాని రాక‌ముందే అక్కడ త‌క్కువ ధ‌ర ప‌లుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు చెందిన భూముల‌ను ప్రభుత్వ పెద్దలు కొన్నార‌న్న ఫిర్యాదుపై గ‌తంలోనే సీఐడీ కేసు న‌మోదు చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబు అరెస్టు చేసింది సీఐడీ. ప్రధానంగా 1,100 ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగంగా ఉంది. ఇందులో 169 ఎకరాల 27 గుంటలకు సంబంధించి విచారణలో భాగంగా ఐదుగురిని అరెస్టు చేశామ‌ని సీఐడీ తెలిపింది.

ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణ ఆయ‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు ఉన్నార‌న్న సీఐడీ ఈ లావాదేవీలు బినామీ రూపంలో జ‌రిగాయ‌ని తెలిపింది. రాజ‌ధాని గ్రామాలైన అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89ఎకరాల 8గుంటల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా హౌసింగ్‌ డైరెక్టర్‌ ఖాతాల ద్వారా కొన్ని లావాదేవీలు జ‌రిగాయ‌ని నిర్ధారించిన‌ట్టు సీఐడీ పేర్కొంది.

కేసులో నిందితులుగా ఉన్న వారి తరఫు మనుషులు మరో 79ఎకరాల 45 గుంటల అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడించింది సీఐడీ. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య 15 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నిర్ధారించిన‌ట్టు పేర్కొంది. దుగ్గిరాల‌కు చెందిన య‌ల‌మాటి ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో సీఐడీ కేసు న‌మోదు చేసింది. కేసులో అరెస్టైన నిందితుల‌ను బెజ‌వాడ సీఐడీ కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories