ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ!

ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ!
x
Highlights

ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అజెండా అంశాలను త్వరగా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.

ఈనెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అజెండా అంశాలను త్వరగా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.

ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ.. అదేరోజు ఇంటి నిర్మాణాల కార్యక్రమం ప్రారంభించాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ప్రతీష్ఠాత్మక కార్యక్రమం కావటంతో ప్రభుత్వం దీనిని ప్రతీ జిల్లాలో పండుగ తరహాలో నిర్వహించాలని భావిస్తోంది. అదేవిధంగా ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు కార్యక్రమాలపై మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం జగన్.

ఈనెల 30న.. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై కేబినెట్‌ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. ప్రధానంగా సంక్రాంతి నుండి ముఖ్యమంత్రి జగన్ రచ్చబండ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకుంటున్నారు.

పోలవరం సందర్శించిన సీఎం జగన్.. ప్రాజెక్టు దగ్గర ఉన్న వాస్తవ పరిస్థితులను మంత్రులకు వివరించడంతోపాటు.. కేంద్ర ఆలోచనలు ఏంటనేది మంత్రులకు తెలియజేసే అవకాశం ఉండనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహణపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories