AP Cabinet Meeting: ఈ నెల 23న ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

AP Cabinet Meeting On October 23rd
x

AP Cabinet Meeting: ఈ నెల 23న ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Highlights

AP Cabinet Meeting: ఈ నెల 23న ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. సెక్రటేరియట్‌లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు కేబినెట్‌ సమావేశం జరగనుంది.

AP Cabinet Meeting: ఈ నెల 23న ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. సెక్రటేరియట్‌లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చలు సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సూపర్‌ సిక్స్‌ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకంపై కేబినెట్‌ చర్చించనుంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే దీపావళి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై ప్రతిపాదన సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపు, చెత్త పన్ను రద్దు, 13 కొత్త మున్సిపాల్టీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 23న జరిగే కేబినెట్‌ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories