ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం

AP Cabinet Meeting Concluded
x

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం

Highlights

AP Cabinet: భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు ఆమోదం

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఏపీ పంపెడ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ, భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 1,301 చదరపు కిలోమీటర్ల విస్తర్ణంలో రెండు మున్సిపాలిటీలు.. 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కేబిటెన్ ఆమోదముత్ర వేసింది. 8 మున్సిపాలిటీలు, 28 మండలాల్లో 349 గ్రామాలతో 7వేల 281 చదరపు కిలమీటర్ల పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21న.. 8వ తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్ స్టీల్‌ను.. భాగస్వామిగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం చీఫ్ పీఆర్‌వో పోస్టు భర్తీ, కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories