AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet meeting concluded
x

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

Highlights

AP Cabinet: రెండు గంటల పాటు కొనసాగిన మంత్రివర్గ భేటీ

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసింది కేబినెట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, న్యూ సాండ్ పాలసీపై విధివిధానాలను త్వరలోనే రూపొందించనుంది ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ నుంచి 2 వేల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3 వేల 200 కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories