ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలు

ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

* మాజీ రాష్ట్రప్రతి ప్రణబ్‌ మృతికి సంతాప తీర్మానం * గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి సంతాపం * పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించిన సభ * సంతాప తీర్మానాల తర్వాత సభ వాయిదా వేసిన స్పీకర్ * కొనసాగుతోన్న బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదు దశాబ్దాల పాటు దేశానికి ఆదర్శవంతమైన సేవలను ప్రణబ్‌ ముఖర్జీ అందించారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. అనంతరం ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. తన సుమధుర గానంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని కొనియాడారు. అలాగే.. పలువురు మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. అనంతరం శాసనసభను స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. మరోవైపు బీఏసీ సమావేశం కొనసాగుతోంది. సభలో చర్చించాల్సిన అంశాలు, సభ నిర్వహణపై సభ్యులు చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories