AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly Budget Meetings From Today
x

AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 

Highlights

AP Assembly: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

AP Assembly: కాసేపట్లో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్‌ ఆమోదించనుంది.

ఇక కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories