ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly Budget Meetings from Today
x

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Highlights

AP Assembly: ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

AP Assembly: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఇవాళ ఉధయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది.

అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ద్వారా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories