Mukesh Kumar Meena: నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించింది లేదు

Anyone who breaks the rules will be ignored Says CEO Mukesh Kumar Meena
x

Mukesh Kumar Meena: నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించింది లేదు

Highlights

Mukesh Kumar Meena: ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తప్పనిసారిగా తీసుకోవాలి

Mukesh Kumar Meena: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించింది లేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి, సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలవుతోందని...ఎలాంటి కార్యక్రమమైన అనుమతులు తప్పనిసారిగా తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 46 మంది వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులు, ఇద్దరు డీఆర్వోలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని మరోమారు ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి సభలో భద్రతా లోపాలపై ఫిర్యాదు వచ్చిందని... కేంద్రానికి పంపినట్లు చెప్పారు. భద్రతా లోపాల అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉందన్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించామని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. ఎక్కువగా వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని, ఎప్పకటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. సీ విజిల్‌ యాప్‌ లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు అన్నారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకనటలు తొలగించాలని ఆదేశించామన్నారు. ఇప్పటివరకు లక్షా 99 వేల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు తొలగించామన్నారు. 385 FIRలు నమోదుచేశామన్నారు. 3 రోజుల్లో 3 కోట్ల 39 లక్షల విలవవైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నటించిన చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. ఈ చిత్రం టీజర్‌ విడులైంది. ఇందులో గాజు గ్లాసు సంబంధించిన డైలాగ్స్‌పై ఆయన స్పందించారు. ఇప్పటివరకు టీజర్‌ చూడలేదని...చూశాక ఆ అంశంపై స్పందిస్తాని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ గాజు గ్లాసు చూపించిన అంశంపై నిషేధం లేదని, ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చు అన్నారు. పూర్తిగా పరిశీలించి అంశం ఆధారంగా నిర్ణయం ఉంటుందన్నారు.

జీరో వయెలెన్సు, నో రీపోల్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే విధంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన దానికి అధికారులే బాధ్యత వహించాలని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో హత్యలు...మాచర్లలో కారు తగుల బెట్టిన సంఘటనలపై మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఏపీ ఎన్నికల అధికారి వివరణ కోరినట్టు తెలిపారు. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. హింస రహిత, రీపోలింగ్‌ లేని ఎన్నికల్లో లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories