ఏపీలో ప్రైవేట్ స్కూళ్లపై మరో దెబ్బ..ఆ నిబంధన ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దే!

ఏపీలో ప్రైవేట్ స్కూళ్లపై మరో దెబ్బ..ఆ నిబంధన ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దే!
x
Highlights

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధలకి మరో షాక్ తగలనుంది. ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆగడాలను అరికట్టేందుకు వీలుగా కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాల్సిందేనని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధలకి మరో షాక్ తగలనుంది. ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆగడాలను అరికట్టేందుకు వీలుగా కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాల్సిందేనని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒకవేళ ఈ సిఫార్సులను కనుక ప్రభుత్వం అమలు చేస్తే ఇక ప్రైవేటు విద్యాసంస్ధలు చుక్కలు చూడడం ఖాయమేనని తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలల పై ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఈ సిఫార్సులు చేసింది.

కరోనా టైంలో దాదాపుగా అన్ని ప్రైవేటు విద్యాసంస్ధలు టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా తొలగించడం లాంటివి చేస్తున్నాయి. అయితే వీరి ఆగడాలని అడ్డుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విద్యా కమిషన్ ను కోరాయి. ఇప్పటికే టీచర్లను అడ్మిషన్ల కోసం విద్యార్ధుల ఇళ్లకు పంపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న విద్యాసంస్ధల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసిది. అయితే వీటిని ప్రైవేటు స్కూళ్లు పెడచెవిన పెడుతూ వస్తున్నాయి. అయితే వీటిపైన విద్యా కమిషన్ సీరియస్ అయింది. నధికారికంగా టీచర్లను తొలగించడం చట్ట వ్యతిరేకమని కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు అన్నారు.

1982 విద్యా చట్టం ప్రకారం క్రమశిక్షణకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టకుండా ఉపాధ్యాయులను తొలగించే అధికారం యాజమాన్యాలకు లేదని అయన అన్నారు. ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇవ్వకుండా, రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా ఉపాధ్యాయులను తొలగించడం తమ దృష్టికి వచ్చిందని, ఒకవేళ ఉపాధ్యాయులను తోలిగించాల్సి వస్తే దానికి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా అలా తొలగించాల్సిన పరిస్థితి కనుక వస్తే చట్ట ప్రకారం వారికి పరిహారం ఇవ్వా;ల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రతి నెలా తమ సిబ్బందికి జీతాలు ఇవ్వాలని తెలిపారు. దీన్ని ఉల్లంఘించే ప్రైవేటు యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని కూడా చట్టం చెబుతున్నట్లు వివరించారు.

అయితే చట్టాన్ని ఇలా పెడచెవిన పెట్టి చర్యలను ఉల్లంఘించే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించవచ్చని, జరిమానా వేయవచ్చని చట్టంలో స్పష్టంగా ఉందని అయన తెలిపారు. రాష్ట్రంలోని అందరూ ఆర్జేడీలు, డిఈఓలు తమ పరిధిలో ఇలా ఉల్లంఘనకు పాల్పడుతున్న విద్యాసంస్థలను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories