Andhra Pradesh: ఏపీని భయపెడుతున్న మరో సైక్లోన్

Another Cyclone Fear to Andhra Pradesh Due to Low Pressure at AP and Odisha Border
x

ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలు ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధం నుంచి బయట పడకముందే మరో డేంజర్ బెల్ మోగింది. తాజాగా తుఫాన్‌ ముప్పు వణికిస్తోంది. అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మరి కొన్ని గంటల్లో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఒడిషా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణ థాయ్‌లాండ్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు వాయుగుండంగా మారనుంది.

పశ్చిమ, ఉత్తరపశ్చిమ దిశగా కదలనున్న ఈ విపత్తు రేపటికి తూర్పు కేంద్ర బంగాళాఖాతానికి చేరువై తుపానుగా మారనుంది. ఇది ఏపీ, ఒడిశాల మధ్య ఈ నెల 4న తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది. దీని ప్రభావం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో ఏపీ, ఒడిశా, బెంగాల్‌ సీఎస్‌లతో జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించింది. తుఫాన్ ముందస్తు జాగ్రత్తలపై సీఎస్‌లతో మంతనాలు జరిపింది. 32 NDRF బృందాలను రంగంలోకి దించిన జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ.. సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీని కూడా సిద్ధం చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories