బీసీ కార్పొరేషన్లకు రేపు పదవుల ప్రకటన!

బీసీ కార్పొరేషన్లకు రేపు పదవుల ప్రకటన!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ను పెద్దఎత్తున విభజించి భారీగా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం మొత్తం 56 కార్పొరేషన్లను..

ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ను పెద్దఎత్తున విభజించి భారీగా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం మొత్తం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో 29 మహిళలకు, 27 పురుషులకు దక్కే అవకాశం ఉంది. డైరెక్టర్‌ పదవుల్లో 50 శాతం మహిళలను నామినేట్‌ చేయనున్నారు. సాధ్యమైనన్ని బీసీ కులాలకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు సమాచారం. అంతేకాదు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు రానున్నాయి. అలాగే కొన్ని జిల్లాలకు జనాభా ప్రాతిపదికన 5, 6 పదవులు దక్కే అవకాశం ఉంది. రేపు చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను వైసీపీ ప్రభుత్వం ప్రకటించనుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన లిస్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించారు. రెండు రోజులపాటు ఈ లిస్టును పరిశీలించిన జగన్ రేపు ఫైనల్ చేయనున్నారు. కాగా జగన్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తూ కార్పొరేషన్ పదవులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు అప్పగించారు. వీరంతా ఆయా జిల్లాలకు పరిశీలకులుగా ఉన్నారు. వారు పలు దఫాలుగా వినతులను పరిశీలించి.. దాదాపు 20 రోజులు కసరత్తు చేసి పేర్లను ఖరారు చేశారు. అగ్నికుల క్షత్రియ, వన్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ కులాలకు కూడా ఎప్పుడూ లేనివిధంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories