YCP: అమావాస్య కారణంగా మూడో లిస్టు ప్రకటన వాయిదా

Announcement of Third List Postponed Due to Amavasya
x

YCP: అమావాస్య కారణంగా మూడో లిస్టు ప్రకటన వాయిదా

Highlights

YCP: నేడు లేదా రేపు సాయంత్రానికి అనౌన్స్ చేసే అవకాశం

YCP: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీ నేతల వలసలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ.. అభ్యర్థుల మార్పుల చేర్పు ప్రక్రియను ప్రారంభించింది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులపై వైసీపీలో అధిష్టానం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ అధిష్టానం.. మూడో జాబితాను కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు సాయంత్రం మూడో జాబితా విడుదల చేసే అవకాశాలు ఉంది.

అమావాస్య కారణంగా మూడవ జాబితా ప్రకటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాల్లో టాక్. ఇక మూడో లిస్టులో 15 నుంచి 20 స్థానాల్లో మార్పుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. మూడో జాబితాలో చాలా వరకూ ఎంపీ స్థానాల్లోనే మార్పులు ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సీఎం జగన్ మరికొందరు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories