Anna Canteen Food: అన్న క్యాంటీన్‌ ఫుడ్‌లో అసలు ఏం ఉంటుంది ?

Anna Canteen Food: అన్న క్యాంటీన్‌ ఫుడ్‌లో అసలు ఏం ఉంటుంది ?
x
Highlights

Anna Canteen Food Menu: అన్న క్యాంటీన్‌లో అసలు ఏం ఉంటుంది ? ఏయే ఆహారం ఎంత పరిమాణంలో అందిస్తారు, అన్న క్యాంటీన్ల టైమింగ్స్ ఏంటి, అన్న క్యాంటీన్లలో టిఫిన్, మీల్స్ ధరలు ఎలా ఉన్నాయనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇదిగో...

Anna Canteen Food Menu: ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. 2019 తరువాత మూతపడిన అన్న క్యాంటీన్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు గుడివాడలో ప్రారంభించారు. సాధారణంగా హోటల్‌లో ఫుడ్ మెనూ ఎలాగైతే మెయింటెన్ చేస్తారో.. అలాగే అన్న క్యాంటీన్లలో కూడా ఒక నిర్దిష్టమైన ఫుడ్ మెనూ ఉంది. ఇంతకీ ఈ అన్న క్యాంటీన్లలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడుపూటలా ఎప్పుడు, ఏం లభిస్తుంది, ఈ మెనూలో ఏమేం ఐటమ్స్ ఉంటాయి అనే కదా మీ సందేహం ? ఐతే ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.

అన్న క్యాంటీన్లలో ప్రతీ రోజూ ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు టిఫిన్ లభిస్తుంది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతీ రోజూ టిఫిన్ సమయంలో ఇడ్లీ లభిస్తుంది. ఇడ్లీతో పాటు సాంబార్, అలాగే చట్నీ లేదా కారంపొడి అందిస్తారు. ఇడ్లీ తినని వారి కోసం ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రత్యామ్నాయ అల్పాహారం కూడా అందిస్తారు. అవేంటంటే.. సోమవారం పూరి - కుర్మా, మంగళవారం ఉప్మా - చట్నీ, బుధవారం పొంగల్-చట్నీ-మిక్చర్, గురువారం మళ్లీ పూరి-కుర్మా, శుక్రవారం ఉప్మా-చట్నీ, శనివారం పొంగల్-చట్నీ-మిక్చర్ లభిస్తాయి. అంటే సోమవారం నుండి బుధవారం వరకు ఉన్న మెనూ ఆ తరువాతి మూడు రోజులు రిపీట్ అవుతుందన్నమాట. అలాగే మధ్యాహ్నం భోజనం విషయానికొస్తే.. అన్నంతో పాటు ఏదైనా కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డిస్తారు. రాత్రి వేళ సైతం ఇదే రకమైన మెనూ భోజనంగా అందిస్తారు.

ఏయే ఆహారం ఎంత పరిమాణంలో అందిస్తారంటే..

ఉదయం టిఫిన్ విషయానికొస్తే.. ఇడ్లీలు 3, పూరీలు 3, ఉప్మా 250 గ్రాములు, పొంగల్ 250 గ్రాములు, చట్నీ లేదా పొడి 15 గ్రాములు అందిస్తారు. ప్రతీ రోజూ ఇడ్లీ తప్పనిసరిగా ఉండనుండగా.. అది తినని వారి కోసమే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఏదైనా మరొక రకం టిఫిన్ అందిస్తారు అనే విషయం గమనించాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనం విషయానికొస్తే.. అన్నం 400 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు 120 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు వడ్డిస్తారు.

అన్న క్యాంటీన్ల టైమింగ్స్ ఏంటంటే..

ప్రతీ రోజూ ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు రాత్రి పూట భోజనం అందుబాటులో ఉంటుంది.

అన్న క్యాంటీన్లలో టిఫిన్, మీల్స్ ధరలు..

పేదోడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో లభించే ఆహారం ధరలు కేవలం 5 రూపాయలు మాత్రమే. ఉదయం టిఫిన్ ధర రూ. 5, మధ్యాహ్నం భోజనం టోకెన్ ధర రూ. 5, అలాగే రాత్రి భోజనం ధర కూడా కేవలం రూ. 5 మాత్రమే. అన్న క్యాంటీన్‌కి వెళ్లే వారు కేవలం 15 రూపాయలతో రోజూ మూడుపూటల భోజనం చేసే అవకాశం ఉంది.

అన్న క్యాంటీన్లలో అన్నం తిన్న తరువాత భువనేశ్వరి ఏమన్నారంటే..

అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొని అక్కడున్న వారితో కలిసి భోజనం చేశారు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, "పేదలతో కలిసి భోజనం చేయడం తమకు ఎంతో సంతృప్తినిచ్చింది" అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories