Tirumala: తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Ankurarpana for Tirumala Srivari Brahmotsavam
x

Tirumala: తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Highlights

Tirumala: పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలతో అంకురార్పణ

Tirumala: తిరుమలేశుని శాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణచేశారు. శ్రీవెంకటేశ్వరస్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడి పర్యవేక్షణలో అంకురార్పణ వైభవాన్ని సంతరించుకుంది. శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో భూమాతను పూజించి తెచ్చిన పవిత్ర మట్టిలో నవధాన్యాలను కలిపి మొగ్గలు తొడిగే విధంగా పూజలు నిర్వహించారు.

మహావిష్ణుమూర్తికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజరోహణం నిర్వహిస్తారు. పవిత్ర వేదమంత్రోచ్ఛారణ, మంగళవాద్యాలనడుమ ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. విష్ణమూర్తి అధికార వాహనం గరుత్మండుడి ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ఆరంభమవుతాయి.

మహావిష్ణుమూర్తి స్వరూపంలో తిరుమలలో ఉత్సవమూర్తి మలయప్పస్వామివారి పశుపక్ష్యాదులు పూటకోవాహన రూపంలో సేవలు అందిస్తాయి. లోకసంచార సంకేతంగా తొలిరోజు శే‎షవాహనంపై ఆదిశేషుడి రూపంలో భక్తులకు దర్శమిస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories