కృష్ణానదిలో ప్రమాదకరంగా పశువులు తరలింపు

కృష్ణానదిలో ప్రమాదకరంగా పశువులు తరలింపు
x
Highlights

* కృష్ణానది నుంచి దాటిస్తున్న పలువురు * మరబోటుకు సాయంగా పుట్టికి తాళ్లు కట్టి తరలింపు * మరబోటులో 30 మంది.. పుట్టిలో 10 మంది

అసలే నది.. ఆ పై ప్రవాహం.. ఎటు నుంచి ఎటు పోవాలన్న సాహాసమే.. అది మరబోటులో వెళ్లాలంటేనే ఇంకా సాహాసంతో కూడికున్నదే.. అయితే.. నది పరివాహాక ప్రాంతాల ప్రజలు మాత్రం ఎంత దూరమైన పుట్టిలో.. లేదంటే మర బోటులోనే వెళ్తుంటారు. వారి జీవితాలు నిత్య నదులపై సాహాసమే.. వారు మాత్రమే కాదు.. వారితో పాటు ఉన్న పశులకు కూడా అదే పరిస్థితి. ప్రమాదాలు ఎన్ని జరిగినా.. వారికి మాత్రం అవే దిక్కు.

ఒకవైపు నాగర్‌కర్నూలు.. మరో వైపు కర్నూలు జిల్లా.. మధ్యలో కృష్ణానది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలో దాదాపు 200 కిలోమీటర్లు. ఆరు నుంచి ఏడు గంటల ప్రయాణం. కృష్ణా నది చుట్టూ తిరిగి వెళ్లాలి.. కానీ, నది మధ్యలో నుంచి మరబోటుపై, పుట్టిలో వెళ్తే రెండు నుంచి మూడు కిలోమీటర్లు.. అర్ధగంట సేపు.. టైం కు టైం.. ఖర్చుకు ఖర్చు మిగులుతోంది. దాంతో ప్రజలు వెళ్లాలంటే పుట్టిలో వెళ్తారు.. అదే పశువులు వెళ్లాలంటే.. చుట్టు తిరిగితే ఎక్కువ ఖర్చు అవుతోంది. దాంతో ప్రమాదకరమైన సరే.. అదే ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. కృష్ణానది మీదుగా పశువులను ప్రమాదకరంగా తరలిస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వైపు నుంచి కర్నూల్ జిల్లా సిద్ధేశ్వరం వైపు కృష్ణా నదిలో నుంచి పశువులను ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రోడ్డు మార్గంలో చుట్టు తిరిగి వెళ్లాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నది. నదిలో నుంచి అయితే.. రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే చేరుతుండటంతో పలువురు ఈ విధంగా తీసుకెళ్తున్నారు. దాంతో ఖర్చుతో పాటు.. సమయం మిగులుతోందని చెప్తున్నారు..

ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో... ఒక పడవలో 30 మంది.. పుట్టిలో 10 మంది. పుట్టిలో ఉన్న వారు తమ పశువులను తాడుతో లాగుతుంటే.. మూగజీవాలు కృష్ణానది దాటుతున్నాయి. ఈ ప్రయాణాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే.. ఈ దృశ్యాలు ఓ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్ సందర్భంగా బయటకు వచ్చాయి. గతంలో 2007 జనవరి 18న కృష్ణానదిలో మంచాలకట్ట వద్ద మరబోటు మునిగి 61 మంది జలసమాధి అయ్యారు.. ఇటీవల గద్వాల్ జిల్లాలో పుట్టి మునిగి పది మంది గల్లంతయ్యారు.. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్న కొంత మంది అలానే వ్యవహరిస్తున్నారు.

ఈ వీడియో సోమశిల, నందికొట్కూర్ వంతెన నిర్మాణం ఆవశ్యకతపై స్పష్టతనిస్తుంది. సోమశిల నుంచి నందికొట్కూరుకు ప్రయాణం.. ఏన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితం అయింది. కృష్ణానదిపై సోమశిల వంతెన నిర్మాణం.. వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వంతెన నిర్మాణం మరుగున పడింది. అయితే.. ఇటీవల కేంద్రం బిడ్జీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు ఆగుతాయని స్థానికులు అంటున్నారు.

ఒకే బోటులో ఎక్కువ మంది ప్రయాణిస్తే మునిగే ప్రమాదం కూడా ఉంది. ఇలా ఒకే బోటులో 30 మంది ప్రయాణించి.. దానికి తోడుగా పుట్టిని.. మూగజీవులను నదిలో తరలిస్తే ప్రమాదకరం అవుతోందని స్థానికులు అంటున్నారు. ఇలాంటి ప్రయాణాలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories