ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదల

ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదల
x
ap cm ys jaganmohan reddy releasing econamic survey report in amaravathi
Highlights

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదల అయింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదల అయింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఏపీ ప్రణాళికా శాఖ కార్యదర్శి అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ చెప్పారు.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

*ప్రస్తుత ధరల్లో 2019-20 ఏడాది 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)

* 1.10 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌డీపీ పెరుగుదల

* స్థిర ధరల్లో 8.16 శాతం జీఎస్‌డీపీ పెరుగుదల

* స్థిర ధరల్లో జీఎస్‌డీపీ 6,72,018 కోట్ల రూపాయలు

* 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ)

* రాష్ట్ర తలసరి ఆశయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగుదల

* తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల

* 11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ

* పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి

* రాష్ట్రంలో గత ఏడాది అక్షరాస్యత 67.35 శాతం

* సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories