విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. వైఎస్ వివేకానంద హత్య కేసు పై హై కోర్టుకు సీబీఐ.. ఏపీ లోకల్ వార్తలు!

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. వైఎస్ వివేకానంద హత్య కేసు పై హై కోర్టుకు సీబీఐ.. ఏపీ లోకల్ వార్తలు!
x
Highlights

విజయవాడ భవానిపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐరన్ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. నాలుగు ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు.

వైఎస్ వివేకానంద హత్య కేసు పై హై కోర్టుకు సీబీఐ

వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన కేసు వివరాల రికార్డులను తమకు అందేలా చూడాలంటూ సీబీఐ హై కోర్టులో పిటిషన్ వేసింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను కోరగా తమకు అనుమతులు లేవని ఆయన నిరాకరించారు. దాంతో రికార్డులు అంద చేసేలా పులివెందుల మేజిస్ట్రేట్ ను ఆదేశించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. సీబీఐ వాదనలు విన్న హై కోర్టు కేసు రేపటికి వాయిదా వేసింది.

భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ భవానిపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐరన్ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. నాలుగు ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఐరన్ కు మంటలు అంటుకోవడంతో.. భవానీ పురం అంతా దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు..

ఆశావర్కర్లు నిరసన బాట..

శ్రీకాకుళంలో ఆశావర్కర్లు నిరసన బాట పట్టారు. ఆశా వర్కర్లను సచివాలయాలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమను సచివాలయాలకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 60 ఏళ్లు పైబడిన ఆశా వర్కర్లను రిటైర్మెంట్ పేరుతో తొలగిస్తే వెంటనే వారికి బెనిఫిట్స్ అన్నీ వర్తింపజేయాలని కోరారు.

ఏసీబీ అధికారులు దాడులు..

అనంతపురం గుంతకల్లు మండలంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో దాడులు చేశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద నుండి సీనియర్ అసిస్టెంట్ వేమన్న లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏపీలో అరాచక పాలన...

ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు అమరావతి పరిరక్షణ సమితి సభ‌్యులు. ఛలో గుంటూరు కార్యక్రమంలో 250 మందిని గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా లాఠీలతో కొట్టించడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు.

క్షుద్రపూజలు కలకలం..

కర్నూలు జిల్లా జోహారపురంలో ఓ షాపు ముందు క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి సమయంలో ఒక షాపు ముందు క్షుద్రపూజలు చేసారు. షాపు ముందు గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, పుర్రెతో పూజలు చేయడం సంచలనంగా మారింది. అది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటివి జరగకుండా చూడాలంటూ స్థానికులు కోరుతున్నారు.

టీడీపీ నేతలు అసహనం..

వైసీపీ ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప. పోలవరానికి నిధులు తీసుకురాలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 71శాతం పూర్తి చేశామన్నారు. గతంలో పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నీతి అయోగ్‌ సూచించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు నిమ్మకాయల చినరాజప్ప.

Show Full Article
Print Article
Next Story
More Stories