CM Jagan Review Meeting About Coronavirus : బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి: సీఎం జగన్

CM Jagan Review Meeting About Coronavirus : బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి: సీఎం జగన్
x
andhrapradesh cm jagan meeting about coronavirus in tadepalli
Highlights

CM Jagan Review Meeting About Coronavirus : ఏపీ కరోనా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై చికిత్స పొందిన రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని

CM Jagan Review Meeting About Coronavirus : ఏపీ కరోనా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై చికిత్స పొందిన రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన 104, 14410 కాల్ సెంటర్ల పనితీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. కాల్‌సెంటర్‌ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు జగన్.. ఇక అటు కరోనా ఆస్పత్రుల్లో ఆహారం మెనూపై ఆరా తీసిన సీఎం.. టెలీమెడిసిన్ మందులు తీసుకున్న వారి పరిస్థితి గురించి కూడా వారికి ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. ఆహారం మెనూ కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు.

ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు బాగా చేస్తున్నామని అన్నారు.. చేస్తున్న పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి పది లక్షల మందిలో 43,059 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు 8.87 శాతం ఉంటే, ఏపీలో కరోనా పాజిటివ్ 8.56 శాతం ఉందని అన్నారు. ఇక మరణాల రేటు విషయంలో దేశంలో 2.07 శాతం ఉంటే రాష్ట్రంలో 0.89 శాతం మాత్రమే ఉందని జగన్ స్పష్టం చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలు కూడా ఈ పోస్టర్‌లో ఉండాలని.. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories